TSPSC SIT : టీఎస్పీఎస్సీ కేసులో సిట్ దూకుడు
మరో 10 మంది అరెస్ట్
TSPSC SIT : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు లీక్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించింది. పలువురిని విచారించింది. టీఎస్పీఎస్సీ(TSPSC) చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ తో పాటు కమిషన్ సభ్యులను సైతం విచారించింది సిట్.
తాజాగా పేపర్ లీక్ కేసులో 10 మందిని అరెస్ట్ చేసింది రాష్ట్ర దర్యాప్తు సంస్థ. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 74 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పేపర్ లీక్ కేసును ఛేదించేందుకు సిట్ ఆధ్వర్యంలో 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఆ టీంలు విస్తృతంగా విచారణ చేపట్టడంలో నిమగ్నం అయ్యాయి.
మరో వైపు హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. సిట్ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ కోర్టు ప్రశ్నించింది. ఎందుకు ఆలస్యమని ప్రశ్నించింది. దీంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసింది సిట్. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 పరీక్ష నిర్వహించింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి.
మరో వైపు ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేశాయి. సిట్ దర్యాప్తు వల్ల ఒరిగేది ఏమీ ఉండదని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి.
Also Read : Kadiyam Srihari Rajaiah : కడియం భావోద్వేగం