TDP Ayyanna Patrudu: షర్మిల భద్రతపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు !

షర్మిల భద్రతపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు !

TDP Ayyanna Patrudu: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భద్రతపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా ఉండదని… తన రాజకీయ లబ్ధి కోసం షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆరోపించారు. కాబట్టి కేంద్రప్రభుత్వం షర్మిలకు భద్రత పెంచాలని డిమాండ్ చేసారు. రాజశేఖరరెడ్డి తన ఆస్తిలో షర్మిలకు వాటా రాసారు. అయినా జగన్ ఇవ్వడం లేదు. ఒకవైపు రాజకీయంగా, మరోవైపు ఆర్ధిక లావాదేవీల పరంగా శతృత్వం ఉన్న తన సోదరి షర్మిలను జగన్ అంతమొందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

TDP Ayyanna Patrudu Comment

ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ… ‘‘భూములు కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు బెదిరించి లాక్కుంటున్నారు. వైసీపీ నాయకుల అక్రమాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని భీమిలిలో సభ పెట్టారు ? విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను స్వాహా చేసినందుకా ? పేదల భూములు దోచుకున్నందుకా ? అని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు.

వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత భూ కబ్జాలు చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. విశాఖలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములను ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వాహా చేసారన్నారు. వచ్చే మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు బయటకు తీస్తాం. భూ కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తాం… దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి నాకూ ప్రాణహాని ఉంది. రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశా. గన్‌ మెన్‌ను ఇస్తానని ఎస్పీ అంటే నేనే వద్దన్నాను. దానికి కారణం కూడా నేను ఎక్కడ ఉన్నానో ఆ గన్‌మెన్‌లే సమాచారం ఇస్తారని నా అనుమానం అని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Also Read : Nara Bhuvaneswari: చంద్రబాబు భార్య భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం !

Leave A Reply

Your Email Id will not be published!