TDP Janasena JAC : టీడీపీ..జనసేన ఆందోళన
TDP Janasena JAC : అమరావతి – రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదంటూ టీడీపీ – జనసేన జేఏసీ ఆరోపించింది. రెండు పార్టీలు ఇక నుంచి ఉమ్మడిగా పోరాటం చేస్తాయని ప్రకటించాయి. అధికార పార్టీకి చెందిన వారికే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను పట్టించు కోవడం లేదని మండిపడ్డాయి.
TDP Janasena JAC Issue Viral
ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఉమ్మడిగా ఆందోళన బాట పట్టాయి. ఇదే సమయంలో ఇక నుంచి ప్రతి శనివారం, ఆదివారాలలో సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించాయి టీడీపీ – జనసేన పార్టీలు(Janasena). ఈ మేరకు సంయుక్త కార్యాచరణ కమిటీలుగా ఏర్పడ్డాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఆదివారం కూడా ఇది కొనసాగుతుందని ప్రకటించాయి.
నేడు, రేపు టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు .. ప్రతి శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆందోళనలు చేపట్టాలని టీడీపీ-జనసేన జేఏసీ నిర్ణయం.. 18, 19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనుంది టీడీపీ – జనసేన జేఏసీ .
ఇదిలా ఉండగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా ఇటీవలే రిలీజ్ అయ్యారు. ఆయనకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.
Also Read : Harish Rao : కాంగ్రెస్ 420 మేనిఫెస్టో