TDP Maha Shakti : మహాశక్తికి టీడీపీ శ్రీకారం – చంద్రబాబు
దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందించాం
TDP Maha Shakti : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తయారు చేసిన మహాశక్తి కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 2.5 కోట్ల మహిళలను అభివృద్ది చేసేందుకు దీనిని తయారు చేశామన్నారు. మహా శక్తి అనేది తన మనసులోంచి వచ్చిందన్నారు . ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని పేర్కొన్నారు.
ఆడబిడ్డలు చదువు కోవాలని మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాఉట చేశామని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఉద్యోగాలు, కాలేజీల్లో ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. మగ వాళ్ల కంటే మహిళలకే ఆలోచనా శక్తి ఎక్కువ అని ప్రశంసించారు. వారికి తెలివి తేటలు అధికంగా ఉంటాయన్నారు. ఒకప్పుడు కూతురు పెళ్లి చేయాలంటే కట్నం గురించి ఆలోచించే వారని, కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు.
ఇప్పుడు కట్నం గురించి ఆలోచించడం లేదన్నారు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). అంతే కాదు మగ వారి కంటే మహిళలే ఎక్కువగా సంపాదిస్తున్నారని చెప్పారు. చదువుకోని మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకు వచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. మహిళల్లో పొదుపు అలవాటును పెంచామన్నారు.
అమ్మకు వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. మహిళను స్పీకర్ గా చేశామన్నారు. దీపం పథకం కింద వంట గ్యాస్ ఇచ్చామన్నారు. పవర్ లోకి వస్తే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. పసుపు , కుంకుమ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు.
Also Read : Dharmana Prasad Rao : ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
