TDP MLC Celebrations : తెలుగుదేశం విజయోత్సవం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బాట
TDP MLC Celebrations : ఏపీలో సందింటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దక్కినా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గెలుపు దక్కలేదు. మొత్తం మూడు స్థానాలలో ఎన్నికలు జరిగితే భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందడం విస్తు పోయేలా చేసింది.
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. 175 స్థానాలలో ఈసారి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్ రెడ్డి. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. అన్నీ తానే అయి వ్యవహరిస్తూ వచ్చారు.
ప్రతి జిల్లాకు ఒకరిని ఇంఛార్జ్ గా నియమించారు. త్వరలోనే విశాఖ నుంచే తాను పాలన సాగిస్తానని ప్రకటించారు. ఈ సమయంలో యువత ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా మూడు సీట్లకు మూడు కూడా టీడీపీ వశం కావడం ఒకింత అధికార పార్టీలో ఒకింత కలవరానికి గురి చేసిందనే చెప్పక తప్పదు.
ఇక పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నిక చివరి వరకు ఉత్కంఠ సాగింది. మొదటి ప్రాధాన్యత లో ఎవరీకి మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత కింద లెక్కించారు. చివరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థిపై 7,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
చివరకు ఆయన విజయం సాధించినట్లు ప్రకటించిన కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ పత్రం ఇవ్వకుండా వెళ్లి పోయారు. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ను అడ్డుకోవడంతో అభ్యర్థితో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
చివరకు ఆదివారం రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఫామ్ ను ఇవ్వడంతో గొడవ సద్దు మణిగింది. అనంతరం రామ గోపాల్ రెడ్డి బయటకు వచ్చారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. టీడీపీ విజయోత్సవంలో మునిగి(TDP MLC Celebrations) పోయింది.
Also Read : ఎట్టకేలకు ఎమ్మెల్సీకి అందజేత