TDP Slams : ఆంధ్రప్రదేశ్ – ఏపీ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. పోలీసులు చివరకు అధికార పార్టీకి తొత్తులుగా, కార్యకర్తలుగా మారి పోయారని ఆరోపించింది. మంగళవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది.
TDP Slams AP Police Behavior
పదుల సంఖ్యలో పోలీసులు ఇష్టానుసారంగా తలుపులు బద్దలు కొట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. అరెస్ట్ చేయాలంటే ఇలా ఇళ్ల మీద పడి పోతారా అని నిలదీసింది టీడీపీ(TDP). మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చౌదరి ఇంటిపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని పేర్కొంది.
బండారు అరెస్ట్ ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బండారు వ్యక్తిగత విమర్శలు చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిని ఏకి పారేశారు. ప్రత్యేకించి రోజా పట్ల అభ్యంతరకరమైన భాషను వాడారు. ఆమె బ్లూ ఫిలింలలో నటించిందని , తన వద్ద క్యాసెట్లు కూడా ఉన్నాయంటూ ప్రకటించారు. దీంతో ఏపీ మహిళా కమిషన్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
Also Read : Minister KTR : రేవంత్ పై కేటీఆర్ ఫైర్