Hardik Pandya : అద్భుత విజయం పాండ్యా భావోద్వేగం
ఆ ఇద్దరి వల్లే ఈ విక్టరీ సాధ్యమైంది
Hardik Pandya : కొంత కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. ఫామ్ లేమి అతడిని బాధ పెట్టింది. ఆపై గాయం వెంటాడింది. కానీ దెబ్బతిన్న పులిలా మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
అంతేనా వరల్డ్ లోనే అత్యంత రిచ్ లీగ్ పేరొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 లో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా ఎంపికయ్యాడు. కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి తొలిసారిలోనే ఆ జట్టుకు టైటిల్ తీసుకు వచ్చేలా చేశాడు.
క్రికెటర్ గా, ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). అంతేనా భారత జట్టులోకి మళ్లీ వచ్చాడు.
సత్తా చాటాడు., ఏకంగా నాయకత్వ నైపుణ్యంతో ప్రమోషన్ కొట్టాడు. ఐర్లాండ్ టూర్ లో టీమిండియాకు సారథిగా ఎంపికయ్యాడు.
ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. రెండు టి20 మ్యాచ్ ల సీరీస్ లో 2-0 తేడాతో ఓడించి సీరీస్ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఐర్లాండ్
లోని డబ్లిన్ లో జరిగిన టీ20 రెండో మ్యాచ్ లో భారత జట్టు ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది.
నువ్వా నేనా అన్న రీతిలో ఆట సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఐర్లాండ్
జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 రన్స్ చేసింది.
అయితే ఆఖరులో చాలా తెలివిగా బౌలర్లను ఉపయోగించాడు పాండ్యా. మ్యాచ్ అనంతరం హార్దిక్ మీడియాతో మాట్లాడాడు.
ఆఖరులో జమ్మూ కాశ్మీర్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై నమ్మకం ఉంచా. అతడికే చాన్స్ ఇవ్వడంతో నా నమ్మకాన్ని నిలబెట్టాడంటూ కితాబు ఇచ్చాడు.
అంతే కాదు భువీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. ఇదే సమయంలో ఐర్లాండ్ జట్టు కూడా అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు హార్దిక్ పాండ్యా.
Also Read : దంచి కొట్టిన హుడా రెచ్చి పోయిన శాంసన్