PM Modi : దేశాభివృద్దిలో టెక్నాలజీ కీలకం – మోదీ
దేశాలు అప్ డేట్ కావాలని పిలుపు
PM Modi : టెక్నాలజీ మారుతోంది. దేశాల మధ్య అంతరాలు తొలగి పోతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం మరింత మార్పు చోటు చేసుకుంటోంది. దీనిని ప్రతి దేశం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). భారత దేశంలో సాంకేతికత మినహాయింపు అనేది ఉండదన్నారు.
హైదరాబాద్ లో మంగళవారం ఐక్యారాజ్య సమితి ప్రపంచ జియో స్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో భారత దేశం గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సాధించిన ప్రగతిని ప్రదర్శించేందుకు సిద్దంగా ఉందన్నారు. సంక్షోభ సమయంలో ఒకరినొకరు సహాయం చేసుకునేందుకు అంతర్జాతీయ సమాజానికి సంస్థాగత విధానం అవసరమన్నారు.
ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థలు ప్రతి ప్రాంతంలోని వనరులను చివరి మైలుకు తీసుకు వెళ్లగలమని అభిప్రాయపడ్డారు. ఐదు రోజుల సదస్సులో సమీకృత జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ , దాని సామర్థ్యాలు , సామర్థ్యాల అభివృద్ది పటిష్టతకు సంబంధంచిన సమస్యలను చర్చించేందుకు 115 దేశాల నుండి 550 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ప్రపంచంలో స్టార్టప్ హబ్ లలో భారత్ నెంబర్ లో ఉందన్నారు ప్రధానమంత్రి(PM Modi). గత ఏడాది 2021 నుండి యునికార్న్ స్టార్టప్ ల సంఖ్యను రెండింతలు చేశామన్నారు నరేంద్ర మోదీ. భారత దేశ అభివృద్ధి ప్రయాణంలో సాంకేతికత, ప్రతిభ రెండు స్తంభాలు కీలకమైనవని స్పష్టం చేశారు.
సాంకేతికత పరివర్తనను తీసుకు వస్తుంది. భారతదేశంలో ప్రధానంగా ఇటీవల టెక్నాలజీ వినియోగం మరింత పెరిగిందన్నారు. అన్ని రంగాలలో టెక్నాలజీని వాడుకుంటే మరింత అభివృద్దిని సాధించ వచ్చని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి.
Also Read : తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్