Tej Pratap Yadav : వేధింపులు తట్టుకోలేకే విడాకులు కోరా
లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్
Tej Pratap Yadav : మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అనారోగ్యంతో తండ్రి ఓ వైపు ఇబ్బంది పడుతుంటే మరో వైపు తాను విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.
పెళ్లి జరిగిన తర్వాత వేధింపులకు సంబంధించిన వీడియోలు విడుదల చేస్తానని ప్రకటించాడు తేజ్ ప్రతాప్ యాదవ్. అతడి విడాకుల కేసు గురించి నివేదికను అందించిన న్యూస్ పోర్టల్ కు వ్యతిరేకంగా ఇవాళ నోరు విప్పాడు.
తేజ్ ప్రతాప్ యాదవ్ , ఐశ్వర్య రాయ్ చివరి సారిగా పాట్నా హైకోర్టులో ఒక నెల కిందట కలిసి కనిపించారు. వైవాహిక వివాదంలో చిక్కుకున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav).
తన వివాహం తర్వాత తాను, కుటుంబం చాలా రకాలుగా బాధ పడ్డామన్నారు. ఈ సందర్భంగా స్వంతంగా వీడియో ద్వారా తన సందేశాన్ని విడుదల చేశాడు.
ఈ వీడియో దాదాపు 7 నిమిషాలకు పైగా ఉంది. నేను నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు అనుభవించిన శారీరక, మౌఖిక వేధింపులు చేసినట్లుగా నిరూపించేందుకు తన వద్ద లెక్కలేనన్ని వీడియో క్లిప్పింగులు ఉన్నాయని, ఆధారాలు కూడా సమర్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు తేజ్ ప్రతాప్ యాదవ్.
నాలుగుగా పిటిషన్ దాఖలు చేసిన్పటి నుండి నిశ్శబ్ధం పాటించానని తెలిపారు. ఇదిలా ఉండగా దివంగత మాజీ సీఎం దరోగ ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ ను మే 2018లో పెళ్లి చేసుకున్నారు.
ఆరు నెలల కంటే తక్కువ కాలమే సాగింది . ఆ తర్వాత నుంచి సీన్ స్టార్ట్ అయ్యింది. మాజీ సీఎం రబ్రీ దేవి ఇంట్లోనే ఉండి పోయింది. తనను వెళ్లగొట్టారంటూ ఆరోపించింది. మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలని కోరాడు.
Also Read : భారత్ సహకారం శ్రీలంకకు అవసరం