Tejashwi Yadav : నెల లోపు భారీగా కొలువుల భ‌ర్తీ – తేజ‌స్వి

ప్ర‌కటించిన బీహార్ డిప్యూటీ సీఎం

Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన తేజ‌స్వి యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక నెల లోపు ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని గుడ్ న్యూస్ చెప్పారు.

నిరుద్యోగులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్దంటూ కోరారు. ప్రాణాలు విలువైన‌వ‌ని వాటిని నిర్ల‌క్ష్యం చేయొద్దంటూ విన్న‌వించారు తేజ‌స్వి యాద‌వ్. మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లేదా మ‌హా కూట‌మి చాలా బ‌లంగా ఉంద‌ని చెప్పారు.

బీహార్ అసెంబ్లీలో బీజేపీ మాత్ర‌మే ప్ర‌తిప‌క్షంగా మిగిలి పోతుంద‌ని ఎద్దేవా చేశారు. సీఎంగా కొలువు తీరిన నితీశ్ కుమార్ ను ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు తేజ‌స్వి యాద‌వ్.

త‌మ రాష్ట్రం చూపిన మార్గాన్ని దేశం అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి. పేద‌ల‌కు వంద‌లాది ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్నారు. భ‌ర్తీ ప్ర‌క్రియ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav) .

నిరుద్యోగానికి వ్య‌తిరేకంగా తాను ఇంత కాలం పోరాడాన‌ని అన్నారు. మునుపెన్న‌డూ లేని రీతిలో జాబ్ ఆఫ‌ర్లు గొప్ప‌గా ఉండ‌బోతున్నాయ‌ని చెప్పారు. దేశానికి చేయాల్సిన ప‌నిని బీహార్ చేసింద‌న్నారు.

పేద‌లు, యువ‌త ప‌డుతున్న బాధ‌ల‌ను మ‌న సీఎం నితీశ్ కుమార్ అనుభ‌వించార‌ని పేర్కొన్నారు. కేవ‌లం ఒకే ఒక్క నెల‌లో మీరు అద్భుతం చూడ‌బోతున్నార‌ని వెల్ల‌డించారు.

బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తోంద‌న్నారు. దేశంలో ప్ర‌తిపక్ష పార్టీలు లేకుండా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంద‌న్నారు.

ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను కూల దోయ‌డం, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడుల‌కు దిగ‌డం ప‌రిపాటిగా మారింద‌ని మండిప‌డ్డారు తేజ‌స్వి యాద‌వ్.

Also Read : నితీశ్ కుమార్ ది తెలివైన నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!