Tejasvi Surya : బీజేపీ ఎంపీ , యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య (Tejasvi Surya)సంచలన కామెంట్స్ చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ కు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఉప సంహరించు కావాలని, అంతే కాకుండా కాశ్మీరీ పండిట్లకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంత వరకు సీఎంను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ సీఎం ఇంటి ముందు నానా రభస చేశారు. ఒక రకంగా దాడి చేసినంత పని చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే ఆ మూవీపై విమర్శలు, ఆరోపణలు, ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ది కాశ్మీరీ ఫైల్స్ మూవీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమోట్ చేస్తున్నారని, వినోద పన్ను ఎందుకు ఇవ్వాలంటూ ఢిల్లీ అసెంబ్లీలో నిలదీశారు అరవింద్ కేజ్రీవాల్.
అంతే కాకుండా సినిమాను ప్రజలంతా చూడాలని అనుకుంటే యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. కశ్మీర్ పండిట్లను ఎంత మందిని కాశ్మీర్ లోయలోకి తరలించే ఏర్పాట్లు బీజేపీ చేసిందంటూ ప్రశ్నించారు.
దీంతో బీజేపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లాయి. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ తేజస్వి సూర్య(Tejasvi Surya) డిమాండ్ చేశారు.
ఆయన సారీ చెప్పేంత దాకా ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. సినిమా నుంచి వచ్చిన డబ్బులను కాశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నా రు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : రాజ్యసభకు వెళ్లాలని ఉంది – నితీశ్ కుమార్