KTR ITC : తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శ ప్రాయంగా మారిందని అన్నారు మంత్రి కేటీఆర్. ఎక్కడా లేని రీతిలో అపారమైన నీటి వనరులను కలిగి ఉందన్నారు. ఎంతోముందు చూపు కలిగిన కేసీఆర్ సీఎంగా ఉండడం రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచిందని పేర్కొన్నారు మంత్రి. నీటి వనరుల్లో విప్లవం సాధించామని ఇది ఏ రాష్ట్రానికి సాధ్యం కాలదేని స్పష్టం చేశారు కేటీఆర్.
కేవలం ఎనిమిదేళ్ల కాలంలో అన్ని రంగాలలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. మరిన్ని నీళ్లను ఇచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కేటీఆర్. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని దీని ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగంలో మరింత ప్రగతి సాధించేందుకు వీలు ఏర్పడుతుంందని తెలిపారు మంత్రి.
దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు కేటీఆర్. రూ. 450 కోట్లతో ఏర్పాటు చేసిన ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి ప్రారంభించారు. ఐటీసీ బిగ్ మిల్లు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు.
ఈ ప్లాంటులో గోధుమ పిండి, చిప్స్ , బిస్కెట్లు, నూడుల్స్ తయారు చేస్తున్నారని తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థ చైర్మన్ సంజీవ్ పురి తమ ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని ప్రశంసించారని స్పష్టం చేశారు(KTR ITC).
దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో 46 వేల చెరువులను బాగు చేశామని చెప్పారు కేటీఆర్.
Also Read : తెలంగాణ బడ్జెట్ పై ఫోకస్