Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 9వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గవర్నర్ లేకుండానే ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
ఈ సందర్భంగా తన బడ్జెట్(Telangana Assembly )ప్రసంగాన్ని రెండు గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ అయ్యింది. మధ్యాహ్నం 1.30 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు హరీశ్ రావు.
అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం ప్రకటించారు. ఇదిలా ఉండగా బడ్జెట్(Telangana Assembly )ప్రసంగానికి అడ్డు తగాలరనే నెపంతో స్పీకర్ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ , రఘునందన్ రావు, రాజా సింగ్ లను సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
వీరిని సస్పెండ్ చేయాలంటూ సిఫారసు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన ప్రతిపాదనకు అసెంబ్లీలోని శాసనసభ్యులంతా ముక్త కంఠంతో ఓకే చెప్పారు.
దీంతో ముగ్గురు సభ్యులు వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని ఆదేశించారు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఏమరకు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత దాకా ఈ ముగ్గురి సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామికవాదులు తీవ్రంగా తప్పు పట్టారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ భయపడి ఈ నిర్ణయం తీసుకునేలా చేశారంటూ ఈటల రాజేందర్ ఆరోపించారు.
Also Read : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్