BJP 3rd List : వ్యూహాత్మకంగా బీజేపీ ఎంపిక
35 మందితో మూడో జాబితా ఖరారు
BJP 3rd List : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీసీ నినాదంతో ముందుకు వెళుతోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తాము సీఎంను చేస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా తొలి జాబితాలో 52 మందిని ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో మరికొందరిని ఖరారు చేసింది. తాజాగా 35 మందితో మూడో లిస్టును(BJP 3rd List) వెల్లడించింది.
BJP 3rd List Released
ఇందులో ఎక్కువగా ప్రజలతో పరిచయం లేని వ్యక్తులకు సీట్లు అప్పగించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏకంగా ఎన్టీఆర్ ను కల్వకుర్తి నుంచి ఓడించిన చిత్తరంజన్ దాస్ కు జడ్చర్ల సీటు కేటాయించింది. ఇక్కడ బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఇటీవలే ఎర్రశేఖర్ గులాబీ గూటికి చేరారు.
మొత్తంగా వెనుకబడిన వర్గాలకు ఎక్కువ సీట్లు వచ్చేలా చూసింది హైకమాండ్. ఇక సీట్ల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి. మంచిర్యాల నుంచి రఘునాథ్ , ఆసిఫాబాద్ నుంచి ఆత్మా రామ్ నాయక్ , బోధన్ నుంచి మోహన్ రెడ్డి, బాన్సువాడ నుంచి ఎండల లక్ష్మీ నారాయణకు సీట్లను కేటాయించింది.
నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ , మంథని నుంచి సునీల్ రెడ్డి, మెదక్ నుంచి విజయ్ కుమార్ , నారాయణ్ ఖేడ్ నుంచి సంగప్ప, ఆందోల్ నుంచి పల్లి బాబు మోహన్ , జహీరాబాద్ నుంచి రాజ నరసింహ, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్ , ఎల్పీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేసింది.
చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, పరిగి నుంచి మారుతీ కిరణ్ , మలక్ పేట నుంచి సురేందర్ రెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణ యాదవ్ , జూబ్లీ హిల్స్ నుంచి లంకాల దీపక్ రెడ్డి, సనత్ నగర్ నుంచి శశి ధర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, నారాయణపేట నుంచి రతంగ్ పాండు రెడ్డి, జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్ , వనపర్తి నుంచి అశ్వథ్థామ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవుని సతీష్ మాదిగను ఖరారు చేసింది.
ఇక షాద్ నగర్ నుంచి అందె బాబయ్య, దేవరకొండ నుంచి లాలూ నాయక్ , హుజూర్ నగర్ నుంచి శ్రీలత రెడ్డి, నల్లగొండ నుంచి శ్రీనివాస్ గౌడ్ , ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్ , పరకాల నుంచి ప్రసాద రావు, పినపాక నుంచి బాలరాజు, పాలేరు నుంచి రవి కుమార్ , సత్తుపల్లి నుంచి రామలింగేశ్వర్ రావును ఎంపిక చేసింది బీజేపీ.
Also Read : Vivek Venkata Swamy : గాడి తప్పిన కేసీఆర్ పాలన