Telangana Congress : ఖాకీలు..ఆఫీసర్లపై ఈసీకి ఫిర్యాదు
అధికార పార్టీకి వంత పాడుతున్నారు
Telangana Congress : న్యూఢిల్లీ – ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
Telangana Congress Complaint against BRS Govt
రిటైర్డ్ అధికారుల జాబితా చిట్టా విప్పారు. వీరంతా పవర్ ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా వ్యాపారస్తులు, కంపెనీలను విరాళాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఏపీ కేడర్ కు చెందిన డీజీపీ , స్టీఫెన్ రవీంద్ర అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సీఎంఓలో ఉన్న స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శులుగా ఉన్న జయేష్ రంజన్ , అరవింద్ కుమార్ లపై నిప్పులు చెరిగారు. వీరు ఫక్తు గులాబీ కార్యకర్తలుగా మారారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వెంటనే వీరిపై బదిలీ వేటు వేయాలని కోరారు.
లేకపోతే తాము కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read : Revanth Reddy : హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పై పోటీకి సై