Telangana Congress : పోరుగల్లు స‌భ‌పై కాంగ్రెస్ ఫోక‌స్

మే 6న రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ

Telangana Congress  : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదుంది. రాష్ట్రంలో కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తూనే ఉంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తోంది.

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని , ఒంట‌రిగానే వెళ్లాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ(Telangana Congress )అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ.

కొంత కాలం నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ తో క‌లిసి రాబోయే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతుంద‌న్న ప్ర‌చారానికి స్వ‌స్తి ప‌లికారు. ఎలాంటి ఒప్పందం ఉండ బోదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు ప‌లువురు సీనియ‌ర్లు రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ఫోక‌స్ పెట్టారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించేందుకు ఓకే చెప్పారు. దీంతో వ‌చ్చే నెల మే6న రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.

దీంతో భారీ ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ చేసే ప‌నిలో ప‌డ్డారు నేత‌లు. వ‌రంగ‌ల్ ప్రాంతానికి పోరుగ‌ల్లు అని మ‌రో పేరుంది. వ‌రంగ‌ల్ చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల‌ను టార్గెట్ చేసుకుంది.

ఆయా జిల్లాల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేలాదిగా త‌ర‌లి వ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే స‌భా స్థలాన్ని ఎంపిక చేసింది టీపీసీసీ. వ‌రంగ‌ల్ లోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగ‌ణంలో సభ నిర్వ‌హించనున్నారు.

Also Read : బండిది ప్ర‌జా వంచ‌న యాత్ర – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!