TS Congress Protest : కాంగ్రెస్ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం
ఖాకీలపై రేణుకా చౌదరి ఫైర్
TS Congress Protest : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి రాహుల్ గాంధీని విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ(TS Congress Protest) ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన చలో రాజ్ భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్ భవన్ కు చేరుకున్నారు. భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇదే సమయంలో ఖైరతాబాద్ చౌరస్తా లో ఓ బైక్ కు నిప్పు పెట్టి నిరసన చేపట్టారు. బస్సుల రాక పోకలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జికి దిగారు.
పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్(TS Congress Protest) నేతలు. దీంతో రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు దూసుకు వెళ్లారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు పోలీసులపై.
ఇదే సమయంలో ఎస్సై చొక్కా పట్టుకున్నారు ఆమె. దీంతో ఆమెకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. రేణుకా చౌదరిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదిలా ఉండగా డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్నారు మల్లు భట్టి విక్రమార్క. రేణుకా చౌదరిపై కేసు నమోదు చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ సీనియర్లు తమ ప్రతాపాన్ని చూపారు.
Also Read : కేసీఆర్ పాలనలో మహిళలకు భద్రత కరువు