Telangana Congress Slams : కేటీఆర్ కాదు లూటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
Telangana Congress Slams : హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత ముదిరి పాకాన పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిలర్ అన్న పేరుందన్నారు. ఇదే సమయంలో టికెట్లకు సంబంధించి కోట్ల రూపాయలకు బేరం పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు.
Telangana Congress Slams BRS
రేవంత్ రెడ్డి పేరు కాదని ఆయన పేరు ప్రస్తుతం మారి పోయిందని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఎక్కడ చూసినా తెలంగాణలో నీ రేటెంత రెడ్డి అని అడుగుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Congress) శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగింది.
నీ పేరు కేటీఆర్ కాదని లూటీఆర్ అంటూ సెటైర్ వేసింది. నీ దుకాణం బంద్ అయ్యేందుకు కొద్ది సమయం మాత్రమే ఉందని పేర్కొంది పార్టీ. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు రెడీగా నిన్ను , నీ తండ్రిని దించేందుకు అని హెచ్చరించింది.
తెలంగాణాను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : Telangana Govenor : ప్రవళిక మృతిపై గవర్నర్ సీరియస్