Telangana CS : ఎన్నిక‌ల కోడ్ అమ‌లుపై స్క్రినింగ్ క‌మిటీ

స్ప‌ష్టం చేసిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి

Telangana CS : తెలంగాణ – కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని 5 రాష్ట్రాల‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా తెలంగాణ‌లో వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 3న ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ ప‌రంగా గెజిట్ నోటిఫికేష‌న్ వెలువ‌రిస్తుంది. నవంబ‌ర్ 13 వ‌ర‌కు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది.

Telangana CS Comment

న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు ఉప స‌హంరించేందుకు వీలుగా తుది గ‌డువు విధించింది. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఈసీ షెడ్యూల్ విడుద‌ల చేయ‌డంతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబ‌ర్ 9 నుండి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.

దీంతో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని మ‌రింత ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు గాను ప్ర‌త్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు శాంతి కుమారి(Santhi Kumari) స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి జీవోలు , ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసేలా హామీలు, ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌క‌టించ కూడ‌ద‌ని ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. పూర్తిగా ఎన్నిక‌ల కోడ్ కింద‌కు వ‌స్తుంద‌ని పేర్కొంది.

మ‌రో వైపు హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌న్ లైసెన్సులు క‌లిగిన వారంతా వెంట‌నే త‌మ వ‌ద్ద ఉన్న అన్ని ఆయుధాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్.

Also Read : CM KCR Comment : కేసీఆర్ సైలెన్స్ డేంజ‌రస్

Leave A Reply

Your Email Id will not be published!