Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల జ‌న సందోహం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ య‌ధావిధిగా కొన‌సాగుతోంది. గ‌త కొంత కాలంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు. క‌ష్టాల నుండి గ‌ట్టెక్కిస్తాడ‌నే న‌మ్మ‌కం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిపై ఉంది.

Tirumala Rush with Devotees

తాజాగా శ్రీ‌నివాసుడు, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 71 వేల 361 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 24 వేల 579 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నార‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

శ్రీ‌వారికి సంబంధించి నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు. స్వామి వారి ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుమ‌ల లోని 8 కంపార్ట్మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని పేర్కొన్నారు.

ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే ఛాన్స్ ఉంద‌ని తెలిపారు ఏవీ ధ‌ర్మా రెడ్డి. మ‌రో వైపు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పించిన‌ట్లు తెలిపారు. న‌డ‌క దారి నుండి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు చేతి క‌ర్ర‌లు అంద‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : Telangana CS : ఎన్నిక‌ల కోడ్ అమ‌లుపై స్క్రినింగ్ క‌మిటీ

Leave A Reply

Your Email Id will not be published!