CM KCR : తెలంగాణ చారిత్ర‌క వార‌స‌త్వానికి ప్ర‌తీక‌

స్ప‌ష్టం చేసిన సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ‌కు ఘ‌న‌మైన వార‌స‌త్వం ఉంది. అంత‌కు మించిన చారిత్ర‌క నేప‌థ్యం ఉంద‌న్నారు సీఎం కేసీఆర్. ఆయ‌న స్వ‌యాన క‌వి, ర‌చ‌యిత‌, మేధావి, అప‌ర చాణ‌క్యుడిగా పేరు పొందిన నాయ‌కుడు, పాల‌కుడు కూడా. గాయ‌కుడైన కేసీఆర్ ఏది మాట్లాడినా దాని వెనుక నిగూఢ‌త దాగి ఉంటుంది. అంతకు మించిన స‌మాచారం ఏదో ఉండి ఉంటుంది.

తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి ప్రాధాన్య‌త సంత‌రించుకునేలా చేశాయి. కార‌ణం ఏమిటంటే కేసీఆర్(KCR) సాహితీ పిపాసీ. తెలంగాణ కోసం ఊరూరా తిరిగిన వ్య‌క్తి. ఈ నేల గురించి గొప్ప‌గా వర్ణించిన నాయ‌కుడు కూడా. అందుకే చారిత్ర‌క వార‌స‌త్వం వెనుక ఉన్న క‌థేమిటో చెప్పారు.

ఆదివారం భార‌త జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌చురించిన తెలంగాణ చ‌రిత్ర పుస్త‌కం 5 సంపుటాల‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఆవిష్క‌రించారు. గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించి తెలంగాణ అంత‌టా ప‌ర్య‌టించారు చ‌రిత్ర‌కారుడు రామోజు హ‌ర గోపాల్.

క్షేత్ర స్థాయిలో సేక‌రించిన స‌మాచారాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ హ‌రికృష్ణ‌, ముర‌ళీకృష్ణ సంపాద‌క‌త్వంలో పుస్త‌కాల‌ను తీసుకు వ‌చ్చారు. ఇక్కడి శిలాజాలు, క‌ట్ట‌డాలు, నాణేలు, శాస‌నాలు, గ్రంథాల గురించి ఇందులో కూలంకుశంగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

Also Read : Australia Record : ఆస్ట్రేలియా అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!