Telangana Election 2023 : తెలంగాణలో 35,356 పోలింగ్ స్టేషన్లు
ఒక్కో పోలింగ్ స్టేషన్ కు 897 మంది ఓటర్లు
Telangana Election 2023 : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ ను డిక్లేర్ చేశారు. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్.
Telangana Election 2023 Updates
ఇక రాష్ట్రంలోని పోలింగ్ విషయానికి వస్తే మొత్తం 35 వేల 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో స్టేషన్ లో కనీసం 897 మంది తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరంగా చూస్తే పట్టణాల్లో 14,464 కేంద్రాలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల 892 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి వెబ్ కాస్ట్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 27 వేల 798 కేంద్రాలలో వీటిని నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. ఇక మహిళల కోసం 597 పోలింగ్ కేంద్రాలు ఉండగా 644 మోడల్ కేంద్రాలు, 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్(Rajiv Kumar).
ఓట్ల పరంగా చూస్తే తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. ఇందులో 1.58 కోట్ల మంది పురుష ఓటర్లు ఉంటే 1.58 కోట్ల మంది మహిళా ఓటర్లు నమోదై ఉన్నారని పేర్కొన్నారు. మరో వైపు 8 లక్షల 11 వేల మంది తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : Telangana Election 2023 : నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్
