Telangana Election Commission : గెజిట్ నోటిఫికేషన్ విడుదల
రిలీజ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Telangana Election Commission : తెలంగాణ – రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(Telangana Election Commission) గెజిట్ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 119 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 3 నుంచి 10 వరకు నామినేషన్లను అభ్యర్థుల నుంచి స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
Telangana Election Commission Updates
ఈనెల 10 వరకు డెడ్ లైన్ ఉంటుందని, 13 వరకు నామినేషన్లను పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. 15 వరకు దరఖాస్తులు ఉప సంహరించేందుకు వీలు కల్పించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.
దీంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 119 సీట్లకు గాను 115 సీట్ల కోసం అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 110 సీట్లను ప్రకటించింది. ఇంకా 19 సీట్లను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ, బీఎస్పీ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మొత్తంగా డిసెంబర్ 3 సాయంత్రం వరకు ఏ పార్టీ పవర్ లోకి వస్తుందనేది తేలి పోతుంది.
Also Read : BJP 3rd List : వ్యూహాత్మకంగా బీజేపీ ఎంపిక
