Telangana Govenor : ప్రవళిక మృతిపై గవర్నర్ సీరియస్
వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశం
Telangana Govenor : తెలంగాణ – రాష్ట్రంలో ప్రవళిక మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీ యువకులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.
Telangana Govenor Serious Comments Viral
శనివారం ఆమె సీరియస్ గా స్పందించారు. ప్రవళిక మృతిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్(Telangana Govenor) ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ , తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ను తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు.
నిరుద్యోగులు సహనం కోల్పోవద్దని , భవిష్యత్తు మిగిలే ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర గవర్నర్. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతో బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె పేరెంట్స్ కు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రవళిక గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి లెటర్ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా తయారైంది. మరో వైపు ప్రతిపక్షాలు ప్రవళిక చావుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
Also Read : Tummala Nageswara Rao : రాహుల్ తో తుమ్మల భేటీ