KTR Telangana : అంబురం తెలంగాణ సంబురం
సంబండ వర్ణాల సమ్మేళనం
KTR Telangana : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న చెరువుల పండుగ కొనసాగితే ఇవాళ సంబండ వర్ణాలకు సంబంధించి సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిమ్న కులాల సంక్షేమమే లక్ష్యంగా పని చేసుకుంటూ పోతోంది. స్వరాష్ట్రంలో గడప గడపకు ఫలాలు అందేలా చేస్తోందని పేర్కొన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతి కుటుంబం ఇవాళ సంతోషానికి లోనవుతోందన్నారు.
ఒకప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం అల్లాడిన తెలగాణ ఇవాళ యావత్ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు కేటీఆర్. సంక్షేమ పథకం అందని ఇళ్లు లేవని పేర్కొన్నారు మంత్రి. లబ్దిదారుడు అందుకోని కుటుంబం అన్నది లేదన్నారు. తెలంగాణ నలుమూలలా సంక్షేమ సంబురాలు ఆదర్శ ప్రాయంగా మారాయని పేర్కొన్నారు కేటీఆర్.
సంక్షేమం భారం కాదని అది పేదలకు అందేలా చూడాలన్నది సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు. అక్షరాలా ఆచరించిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. ప్రతి పథకంలో మానవీయ కోణం ఉండేలా కృషి చేశారని స్పష్టం చేశారు. పేదల కొనుగోలు శక్తిని పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కుండ బద్దలు కొట్టారు. అభివృద్దికి ఆలంబనగా తెలంగాణ నిలిచిందన్నారు.
Also Read : KTR Telangana : అంబురం తెలంగాణ సంబురం