Telangana Governor : గ్యాంగ్ రేప్ కేసుపై గవర్నర్ సీరియస్
వెంటనే నివేదిక ఇవ్వాలని డీజీపికి ఆదేశం
Telangana Governor : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ కేసు. మైనర్ బాలికను ఐదుగురు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.
దీనిపై తీవ్రంగా అభ్యంతరం తెలిపారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోటోలు, వీడియోలు బహిరంగం చేశారు. ఈ ఘటనలో అసలైన నిందితులను పక్కకు తప్పించారంటూ ఆరోపించారు.
ఆ బాలికను తీసుకు వెళ్లి ఇన్నోవా లో అత్యాచారం చేశారని మండిపడ్డారు. పోలీసులే వీరికి అండగా నిలిచారంటూ ఫైర్ అయ్యారు.
రేప్ కేసులో కీలకంగా ఉన్న నిందితుల వివరాలను వెల్లడించారు.
నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. వీరి పేర్లు కూడా తెలిపారు. ఏ1 గా ఎంఐఎం నేత కొడుకు సాదుద్దీన్ , ఏ2గా ఎమ్మెల్యే సోదరుడి కొడుకు ఉమేర్ ఖాన్ ఉన్నారు.
మైనర్ 1 గా వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, మైనర్ 2 గా ఎంఐఎం కార్పొరేట్ కొడుకు, మైనర్ 3 సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కొడుకుగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై సీరియస్ అయ్యారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Telangana Governor) . ఈ ఘటనపై నివేదికను వెంటనే సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు.
రెండో రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేశారు గవర్నర్(Telangana Governor). ఇదిలా ఉండగా బాలికపై రేప్ కు పాల్పడిన నిందితులు లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్ కు వెళ్లారు. ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్ లో ఆశ్రయం పొందారని సమాచారం.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు అరెస్ట్