KTR : రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. సోమవారం కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు విద్యుత్ సరఫరా గురించి వివరాలు వెల్లడించారు. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన ఉండేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఆనాడు చిమ్మ చీకట్లో తెలంగాణ ఉండేదని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యుత్ వెలుగులతో నిండి పోయిందని పేర్కొన్నారు కేటీఆర్.
తెలంగాణ విద్యుత్ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. నిత్యం కోతల నుండి నిరంతరం వెలుగులు పంచేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఎక్కడా లేనిరీతిలో అద్భుత రీతిలో పురోగతి సాధించిందని స్పష్టం చేశారు. దేశానికే దారి చూపే టార్చ్ బేరర్ గా నిలిచిందన్నారు.
విద్యుత్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్ కోసం ధర్నాలు, సబ్ స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014 కంటే నిత్యం ఉండేవని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. ఎక్కడ చూసినా కరెంట్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్న ఘనత తమకే దక్కుతుందన్నారు.
Also Read : Byjus Faces : బైజూస్ పై వడ్డీ చెల్లింపుల భారం
