KTR : ఐటీలో తెలంగాణ ముందంజ దేశం వెనుకంజ‌

ప్ర‌గ‌తి ప‌థంలో కొత్త రాష్ట్రం టాప్

KTR : దేశానికి తెలంగాణ త‌ల‌మానికంగా మారంద‌న్నారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. ఐటీలో గ‌తంలో బెంగ‌ళూరు వైపు చూసే వార‌ని, కానీ ఇప్పుడు య‌వ‌త్ ప్ర‌పంచం తెలంగాణ వైపు చూస్తోంద‌న్నారు.

క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో సైతం రాష్ట్రం ముందంజ‌లో నిలిచింద‌న్నారు. గ‌తంలో ఉన్న రికార్డుల‌ను ఛేజ్ చేసింద‌న్నారు. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను సూప‌ర్ ఫ‌లితాలు సాధించంద‌ని తెలిపారు.

ఐటీలో ఏకంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింద‌ని చెప్పారు. విచిత్రం ఏమిటంటే 26.14 శాతం వృద్ధిని క‌న‌బ‌ర్చింద‌న్నారు. వార్షిక నివేదిక ను విడుద‌ల చేశారు.

దీనిపై విశ్లేషిస్తూ కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు మంత్రి. బుధ‌వారం హైటెక్ సిటీ లోని టెక్ మ‌హీంద్రా ఆఫీసులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేటీఆర్(KTR) పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఐటీ, అనుభంద రంగాల‌కు సంబంధించిన ఎగుమ‌తుల్లో జాతీయ స‌గ‌టు 17.2 శాతంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర స‌గ‌టు రేటు 26.14 శాతం సాధించి ముందంజ‌లో ఉంద‌న్నారు.

మొత్తంగా చూస్తే దేశానికి కంటే రాష్ట్రం 9 శాతం అధికంగా వృద్ధిని సాధించిన‌ట్లు తెలిపారు మంత్రి కేటీఆర్(KTR). 2021-22 ఐటీ ఎగుమ‌తుల వాల్యూ రూ. 1, 83, 569 కోట్లు అని ప్ర‌క‌టించారు.

ఇక దేశ‌మంత‌టా ఐటీ ప‌రంగా నాలుగ‌న్న‌ర ల‌క్ష‌ల జాబ్స్ వ‌స్తే ఇందులో ల‌క్ష‌న్న‌ర‌కు పైగా హైద‌రాబాద్ లో ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని ఇది తాము సాధించిన ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు కేటీఆర్.

హైద‌రాబాద్ లో అంకురాల ఏర్పాటుకు స‌పోర్ట్ చేస్తున్నామ‌ని, అంతే కాకుండా త‌మ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన టీఎస్ఐపాస్ పాల‌సీ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు కేటీఆర్.

Also Read : టీఎస్ఐపాస్ దేశానికి ఆద‌ర్శం

Leave A Reply

Your Email Id will not be published!