V Srinivas Goud : 11న తెలంగాణ సాహిత్య దినోత్స‌వం

మంత్రి విర‌సనోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్

V Srinivas Goud : తెలంగాణ అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్బంగా జూన్ 11న సాహిత్య దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి విర‌సనోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్(V Srinivas Goud). శుక్ర‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్ల పాల‌న‌లో తెలంగాణ సాధించిన ప్ర‌గ‌తిని వివ‌రిస్తామ‌న్నారు. అభివృద్ది , సంక్షేమ ప‌థ‌కాలు, సాహిత్య వైభ‌వాన్ని చాటేలా సాహిత్య దినోత్స‌వం జ‌రుపుతామ‌న్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఉర్దూ , తెలుగు భాష‌లలో రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాలలో ర‌చ‌నం, ప‌ద్యం, ఉర్దూ భ‌ష‌ల్లో క‌వి స‌మ్మేళ‌నం ఉంటుంద‌న్నారు. ఉత్త‌మ క‌విత‌కు రూ . ల‌క్షా 116 రూపాయ‌లు, ద్వితీయ బ‌హుమ‌తిగా 75 వేల 116, మూడో బ‌హుమ‌తి కింద 60 వేల 116 రూపాయ‌లు అందిస్తామ‌న్నారు. ఉత్త‌మ క‌విత‌ల‌ను క‌లిపి పుస్త‌కంగా తీసుకు రావాల‌ని ఆదేశించారు వి. శ్రీ‌నివాస్ గౌడ్.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నాలుగు అకాడమీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ప్రపంచ తెలుగు మ‌హా స‌భ‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. సాహితీ పిపాసి, క‌వి, ర‌చ‌యిత‌, గాయ‌కుడు, వ‌క్త‌, రాజ‌కీయ నాయ‌కుడు, అప‌ర మేధావి అయిన సీఎం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌న్నారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. దాశ‌ర‌థి, కాళోజీ పేర్ల‌తో రాష్ట్ర స్థాయి అవార్డుల‌ను ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు పాల్గొనాల‌ని కోరారు.

Also Read : Jayapraksh Hegde DK : జ‌య ప్ర‌కాశ్ హెగ్డేకు డీకే ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!