PV Satheesh Died : మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇక లేరు

డెక్క‌న్ డెవలప్‌మెంట్ సొసైటీ

PV Satheesh Died : డెక్క‌న్ డెవ‌ల‌ప్ మెంట్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌కుడు పీవీ స‌తీష్ క‌న్ను మూశారు(PV Satheesh Died). ఆయ‌న‌ను అంతా తెలంగాణ మిల్లెట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. జీవిత కాల‌మంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశారు. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ రంగంలో విత్త‌నాల వినియోగం, ఉప‌యోగం గురించి ఆయ‌న ఎంత‌గానో కృషి చేశారు. డీడీఎస్ అనేది దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. పీవీ స‌తీష్ హైద‌రాబాద్ లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు.

డెక్క‌న్ డెవ‌ల‌ప్మెంట్ సొసైటీ ప్ర‌స్తుతం జ‌హీరాబాద్ వేదిక‌గా న‌డుస్తోంది. పీవీ స‌తీష్ వ‌య‌స్సు 77 ఏళ్లు. ఆయ‌న 1983లో జ‌హీరాబాద్ ప్రాంతంలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల మ‌హిళ‌ల జీవితాల‌ను మెరుగు ప‌ర్చ‌డంతో పాటు సంప్ర‌దాయ పంట‌ల‌ను కాపాడేందుకు డీడీఎస్ ను స్థాపించారు. గ‌త నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా పీవీ స‌తీష్ సంస్థ‌కు ప్రాణం పోశారు. జీవిత‌మంతా దానికే అంకితం చేశారు.

డీడీఎస్ చేస్తున్న కృషికి, ప‌నితీరుకు ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు ల‌భించాయి. అంతే కాదు యునైటెడ్ నేష‌న‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం ఈక్వేట‌ర్ బ‌హుమ‌తిని డెక్క‌న్ డెవ‌ల‌ప్ మెంట్ సొసైటీ మ‌హిళ‌లు గెలుపొందారు. వీరి విజ‌యం వెనుక పీవీ స‌తీష్(PV Satheesh) ఉన్నారు.

ఆయ‌న ఇక లేర‌న్న వాస్త‌వాన్ని జ‌హీరాబాద్ తో పాటు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఆయ‌న లేక పోవ‌డం తెలంగాణ ప్రాంతానికి , ప్ర‌త్యేకించి వ్య‌వ‌సాయ రంగానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. ప‌లువురు ప్ర‌ముఖులు, వ్య‌వ‌సాయ నిపుణులు పీవి స‌తీష్ ఆత్మకు శాంతి చేకూరాల‌ని కోరారు.

Also Read : సెర్ప్ ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!