Telangana Ministers : మంత్రులకు అద‌న‌పు బాధ్య‌త‌లు

కీల‌క శాఖ‌లు రేవంత్ రెడ్డికి

Telangana Ministers : హైద‌రాబాద్ – కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరింది. అసెంబ్లీలో ప్రొటెం స్పీక‌ర్ అక్బ‌రుద్దీన్ ఓవైసీ నూత‌నంగా ఎన్నికైన అభ్య‌ర్థుల‌తో ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మంత్రుల‌కు సంబంధించిన శాఖ‌ల‌కు అద‌న‌పు శాఖ‌లు కేటాయించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

Telangana Ministers Other Responsibilities

ఇక శాఖ‌ల వారీగా చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ , అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ , జ‌న‌ర‌ల్ అడ్మినిస్టేష‌న్ , లా అండ్ ఆర్డ‌ర్ , ఇత‌ర కేటాయించ‌ని శాఖ‌లు కూడా కేటాయించారు.

ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఫైనాన్స్ , ప్లానింగ్ , ఎన‌ర్జీ, న‌ల‌మాద ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి నీటి పారుద‌ల , క్యాడ్ , ఆహారం, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ కేటాయించారు. దామోద‌ర రాజ న‌ర‌సింహ‌కు ఆరోగ్యం, వైద్య‌, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ అప్ప‌గించారు.

కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డికి రోడ్లు భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ కేటాయించారు. దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుకు ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ , ఇండ‌స్ట్రీస్ అండ్ కామ‌ర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ‌లు కేటాయించారు.

పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి రెవ్యూ , హౌసింగ్ , స‌మాచారం, పౌర సంబంధాల శాఖ , పొన్నం ప్ర‌భాక‌ర్ కు ర‌వాణా , బీసీ సంక్షేమం , కొండా సురేఖకు ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు, ఎండోమెంట్ శాఖ‌ను అప్ప‌గించారు. దాస‌రి అన‌సూయ అలియాస్ సీత‌క్క‌కు పంచాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ది (గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా) స్త్రీ , శిశు సంక్షేమం శాఖ‌లు అప్ప‌గించారు.

తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుకు వ్య‌వ‌సాయం, మార్కెటింగ్ , స‌హ‌కారం , చేనేత‌, వ‌స్త్రాలు , జూప‌ల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ , ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ‌లు కేటాయించారు.

Also Read : Tirumala : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.40 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!