YS Sharmila Fire : ఖాకీలు..గులాబీ నేతలు గూండాలు – షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ సంచలన కామెంట్స్
YS Sharmila Fire : వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మంగళవారం చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. దెబ్బతిన్న కారులోనే వెళుతున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో గూండాల రాజ్యాం నడుస్తోందని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాదని అది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాకీలు, గులాబీ నేతలు, కార్యకర్తలు గూండాలంటూ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఒక మహిళనని చూడకుండా దాడులకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమకారుల్ని పార్టీ నుంచి వెళ్లగొట్టి టీఆర్ఎస్ గూండాల పార్టీగా మార్చారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను పాదయాత్ర చేపట్టానని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఆగడాలను, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila). తమ పార్టీకి చెందిన బస్సును తగుల బెట్టడం దారుణమన్నారు.
దానిని కేసీఆర్ కు చూపించేందుకే తాను ఇక్కడికి తీసుకు వచ్చానని అన్నారు. ఖాకీలు అడ్డు కోవడం మంచి పద్దతి కాదన్నారు. వాళ్లు ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారారని ఫైర్ అయ్యారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎలాగో టీఆర్ఎస్ కు పోలీసులు కూడా అలా తయారయ్యారంటూ ధ్వజమెత్తారు.
Also Read : ప్రగతి భవన్ ముట్టడి..షర్మిల అరెస్ట్