Telangana Speaker : 14న తెలంగాణ స్పీకర్ ఎన్నిక
నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్
Telangana Speaker : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఈ సందర్బంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయన అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
Telangana Speaker Selection
ఇందులో భాగంగా రెగ్యులర్ స్పీకర్ ను ఎన్నుకునేందుకు రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 14న ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా స్పీకర్ పదవికి పోటీ పడే వారి నుంచి ఈనెల 13న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
మరో వైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ను స్పీకర్ గా చేయనున్నట్లు ఏఐసీసీ హై కమాండ్ ప్రకటించింది. గతంలో మంత్రిగా పని చేశారు. కాగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే ఒక్కరే నామినేషన్ వేయాల్సి ఉంటుంది.
మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 64 సీట్లతో పాటు సీపీఐ ఒక్క సీటుతో కలుపుకుని కాంగ్రెస్ కు 65 సీట్లు రాగా బీఆర్ఎస్ కు 39 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు దక్కాయి.
Also Read : Gidugu Rudraraju : ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల
