Telangana Governor : రాజ్యాంగం వల్లనే తెలంగాణ సాకారం
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
Telangana Governor : భారత రాజ్యంగం అన్నది లేక పోయి ఉంటే ఇవాళ అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం సిద్దించి ఉండేది కాదన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ పౌరులు ప్రాథమిక హక్కులను పొందుతున్నారని చెప్పారు.
ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు జరిగిందన్నారు. నవంబర్ 26న ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. గవర్నర్(Telangana Governor) తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇతర దేశాలకు భారత దేశ రాజ్యాంగం స్పూర్తి దాయకంగా నిలిచిందని అన్నారు గవర్నర్. దేశంలో రాజ్యాంగమే కీలకమని, అదే మనందరికీ ఆదర్శమన్నారు. రాజ్యాంగమే అంతిమమని దానిని ఎవరూ కాదనడానికి వీలు లేదన్నారు.
ప్రజలంతా రాజ్యాంగం నిర్దేశించిన విలువలను పాటించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తమకు నిర్దేశించిన ప్రాథమిక హక్కులను పొందుతూ, వాటి రక్షణ కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో తమ బాధ్యతలను కూడా గుర్తించాలన్నారు గవర్నర్. వాటిని సమర్థవంతంగా పాటించాలని కోరారు తమిళి సై సౌందర రాజన్.
ఇదిలా ఉండగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లు ప్రభుత్వంలో కొలువు తీరి ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అమ్ముడు పోయిన ఆ పార్టీలకు హక్కు లేదు