TTA Celebrations : ఘనంగా తెలంగాణ తమిళుల ఉత్సవం
మూడు రోజుల పాటు ఉత్సవాలు
TTA Celebrations : తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కళా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా పొంగల్ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రాంతానికి తమిళనాడుతో దగ్గరి, అవినాభావ సంబంధం ఉంధి. ఈ మేరకు తెలంగాణ తమిళ సంఘం ప్రతి ఏటా పొంగల్ పండుగను(TTA Celebrations) పురస్కరించుకుని కళా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది.
హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో వందలాది మంది తమిళులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమిళ సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు , చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. అంతే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు తెలంగాణ తమిళులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు.
ప్రతిభా పాటవాలను చాటారు. అంతకు ముందు ఆయా పోటీలలో గెలుపొందిన వారికి షీల్డులు, బహుమతులు అందజేశారు. అనంతరం తమిళ సంఘంలోని చిన్నారులు తమిళ కళోత్సవం, వార్షిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు భారీ ఎత్తున. నృత్యం, గానం , సంగీత పరంగా పలువురు పార్టిసిపేట్ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ తమిళ పండితుల చిత్రంతో కూడిన క్యాలెండర్ ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు లోని వివిధ తమిళ సంస్థలు, తమిళ సంఘాలు , ప్రభుత్వ శాఖల ప్రతినిధులను ఘనంగా తెలంగాణ తమిళ సంఘం(TTA Celebrations) సత్కరించింది. సంఘం చైర్మన్ శ్రీని పటిష్ట , ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో నివసిస్తున్న తమిళులందరికీ పొంగల్ శుభాభినందనలు తెలిపారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు.
Also Read : తిట్టుకోవడం పైనే పార్టీలు ఫోకస్