Telangana TOP : భూగర్భ జలాల పెంపులో తెలంగాణ టాప్
స్పష్టం చేసిన మోదీ కేంద్ర ప్రభుత్వం
Telangana TOP : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే అన్ని రంగాలలో తెలంగాణ ముందంజలో కొనసాగుతోంది. శనివారం కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు భూగర్భ జలాల పెంపులో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని వెల్లడించింది.
Telangana TOP in Water Source
తెలంగాణలో ప్రస్తుతం భూగర్భ జలాలు ఇప్పుడు 739 టీఎంసీల వద్ద ఉన్నాయని పేర్కొంది. గత 9 ఏళ్ల కాలంలో సగటు భూగర్భ జల మట్టం 4 మీటర్లు పెరిగిందని వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రంలోని 83 శాతం మండలాలలో పెరిగిందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
కేసీఆర్ బీఆర్ఎస్(BRS) సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, చెక్ డ్యామ్ లు , ఎత్తి పోతల పథకాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని , దీని వల్లనే భూగర్భ జల మట్టాలు పెరిగాయని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా భూగర్భ జలాల వెలికి తీత 2013 లో 58 శాతం నుండి 2023 నాటికి 39 శాతం తగ్గించడం జరిగిందని పేర్కొంది.
Also Read : Komatireddy Venkat Reddy : కేసీఆర్ పై ఫోకస్ బాబు డోంట్ కేర్