Telangana Tourism : శ్రీవారి..షిర్డీ భక్తులకు ఖుష్ కబర్
తెలంగాణ టూరిజం వెరీ స్పెషల్
Telangana Tourism : తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారిని, షిర్డీలో ఉన్న సాయినాథుడిని దర్శించుకునేందుకు తరలి వెళతారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. వీటిని విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి, షిర్డీకి రెండు బస్సుల చొప్పున , నగరంలో ఏసీ మినీ బస్సులను ప్రవేశ పెట్టారు. మంత్రితో పాటు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. రూ. 3 కోట్ల 50 లక్షలతో బస్సులను కొనుగోలు చేశామన్నారు శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud). తిరుమల, షిర్డీ పుణ్య క్షేత్రాలకు విపరీతమైన ఆదరణ ఉందని తెలిపారు మంత్రి.
తిరుమలలో 2 రోజుల పాటు పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 4,200 , పిల్లలకు రూ. 3,360 ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. పర్యాటకులు ఆన్ లైన్ లో టీఎస్టీడీసీ ని సంప్రదించాలని సూచించారు.
Also Read : Tirumala Rush : పోటెత్తిన భక్తజనం భారీగా ఆదాయం