VC Ravinder Gupta : న‌వీన్ మిట్ట‌ల్ పై వీసీ గుస్సా

త‌న‌పై విచార‌ణ‌కు కోర్టు స్టే

VC Ravinder Gupta : తెలంగాణ యూనివ‌ర్శిటీ వీసీ ర‌వింద‌ర్ గుప్తా(VC Ravinder Gupta)  సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న‌కు ఉన్న ప‌వ‌ర్స్ తొల‌గిస్తూ విద్యా శాఖ క‌మిష‌న‌ర్ న‌వీన్ మిట్ట‌ల్ నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ వీసీని బాధ్యునిగా చేస్తూ పేర్కొంది. 2021 నుండి యూనివ‌ర్శిటీలో జ‌రిగిన అక్ర‌మాల‌కు వీసీనే బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ఏసీబీకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీనిపై భ‌గ్గుమ‌న్నారు వీసీ ర‌వీంద‌ర్ గుప్తా. దీనిని వ్య‌తిరేకిస్తూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ఈ నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేస్తే స్టే ఇచ్చింది.

ఈ సంద‌ర్బంగా వీసీ ర‌వీంద‌ర్ గుప్తా(VC Ravinder Gupta)  మీడియాతో మాట్లాడారు. న‌వీన్ మిట్ట‌ల్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న నిర్వాకం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని ఆరోపించారు. ఆయ‌న‌పై రాష్ట్ర స‌ర్కార్ కు ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ , సీఎస్ శాంతి కుమారి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ల‌న క‌లుస్తాన‌ని వారికి ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు.

అంతే కాకుండా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స‌మ‌యం ఇచ్చార‌ని , ఆ త‌ర్వాత వివ‌రాలు తెలియ చేస్తాన‌ని పేర్కొన్నారు. కోర్టు ఆర్డ‌ర్స్ ప్ర‌కారం రిజిస్ట్రార్ యాదిగిరి నియామ‌కం చెల్ల‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రూల్స్ కు విరుద్దంగా ఈసీ స‌మావేశం ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు. దీనిపై ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read : బీ ఫామ్ నా ఇంటికే వ‌స్తుంది

Leave A Reply

Your Email Id will not be published!