VROS Protest : వీఆర్వో వ్య‌వ‌స్థ‌కు మంగ‌ళం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

ఇత‌ర శాఖ‌ల్లోకి చేర్చ‌డంపై వీఆర్వీలు సీరియ‌స్

VROS Protest :  గ‌త ద‌శాబ్దాల కాలం నుంచి పాతుకు పోయిన వీఆర్వోల వ్య‌వ‌స్థ‌కు చెక్ పెట్టింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు విలేజ్ రెవిన్యూ ఆఫీస‌ర్స్ ను ఇత‌ర శాఖ‌ల్లోకి మారుస్తూ జీవో జారీ చేసింది.

రెవిన్యూ శాఖ‌ను ప‌ర్య‌వేక్షించే భూ ప‌రిపాల‌న విభాగంలో ప‌ని చేస్తున్న 5,385 మందిని ఇత‌ర శాఖ‌ల్లో స‌ర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

కాగా వీరికి జూనియ‌ర్ అసిస్టెంట్ హోదాతో ఇవ్వ‌నున్నారు. వీరి ఎంపిక‌, బ‌దిలీ చేసే బాధ్య‌త‌ను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది.

ఈ మేర‌కు సీఎస్ సోమేశ్ కుమార్ జీవో నంబ‌ర్ 121న విడుద‌ల చేశారు. 2020లో తీసుకు వ‌చ్చిన కొత్త రెవిన్యూ చ‌ట్టం ప్ర‌కారం వీఆర్వోల వ్య‌వ‌స్థ(VROS Protest) పూర్తిగా ర‌ద్ద‌యింది.

ఆయా ఖాళీలు గుర్తించి స‌ర్దుబాటు చేయాల‌ని, లాట‌రీ ప‌ద్ద‌తిన కేటాయించాల‌ని స్ప‌ష్టం చేసింది జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో. అంతే కాకుండా సెల‌వులు, స‌స్పెన్ష‌న్ , డిప్యూటేష‌న్ , ఫారిన్ స‌ర్వీసులో ఉన్న వీఆర్వోల‌ను కూడా ఇత‌ర శాఖ‌ల్లోకి పంపించాల‌ని ఆదేశించారు.

ఒక‌వేళ అద‌నంగా వీఆర్వోలు ఉన్న‌ట్ల‌యితే ఇత‌ర జిల్లాల్లో స‌ర్దుబాటు చేయాల‌ని సూచించింది. వీఆర్వోల‌ను నీటి పారుద‌ల‌, పంచాయ‌తీరాజ్ , విద్య‌, వైద్య శాఖ‌ల‌కు కేటాయించనున్నారు.

ఈ శాఖ‌ల‌తో పాటు దేవాదాయ‌, ఎక్సైజ్, ప‌న్నులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ‌ల్లోకి కూడా తీసుకోవ‌చ్చ‌ని ఆర్థిక శాఖ స్ప‌ష్టం చేసింది. తాజాగా తెలంగాణ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన జీవోను జారీ చేయ‌డంపై భ‌గ్గుమంటున్నారు వీఆర్వోలు.

ఈ జీవోను సీసీఎల్ఏ ఆఫీసు ప్రాంగ‌ణ‌లో ద‌హ‌నం చేశారు. దీనిపై కోర్టుకు వెళ‌తామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

Also Read : స‌క‌ల నేరాల‌కు అడ్డా తెలంగాణ గ‌డ్డ‌

Leave A Reply

Your Email Id will not be published!