CWG 2022 Harjinder Kaur : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ భ‌ళా

ఇండియా ఖాతాలో 9 ప‌త‌కాలు

CWG 2022 Harjinder Kaur : బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హోమ్ లో జ‌రుగుతున్న కామెన్వెల్త్ గేమ్స్ -2022లో భార‌త్ స‌త్తా చాటుతోంది. ప్ర‌ధానంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అత్య‌ధిక ప‌త‌కాలు ద‌క్క‌డం విశేషం.

మొత్తం 9 ప‌త‌కాలు వ‌చ్చాయి భార‌త్ కు. కేవ‌లం వెయిట్ లిఫ్టింగ్ లోనే ఆరు ప‌త‌కాలు అందాయి. ఇక సోమ‌వారం అర్ధ‌రాత్రి మ‌హిళ‌ల వెయిట లిఫ్టింగ్ కు సంబంధించిన 71 కేజీల విభాగంలో హ‌ర్జీంద‌ర్ సింగ్ కౌర్ (CWG 2022 Harjinder Kaur) కాంస్య ప‌త‌కాన్ని సాధించింది.

ఇక స్నాచ్ కేట‌గిరీలో 93 కేజీలో క్లీన్ అండ్ జెర్క్ కేట‌గిరీలో 119 కేజీలతో పాటు క‌లుపుకుని మొత్తం 212 కేజీలు ఎత్తింది కౌర్. ఆమెకు కాంస్య ప‌త‌కం ద‌క్కింది.

ఇక ఈ విభాగంలో ఆతిథ్య దేశం ఇంగ్లండ్ కు చెందిన వెయిట్ లిఫ్ట‌ర్ సారా డేవిస్ బంగారు ప‌త‌కం సాధించింది. కౌర్ కు కాంస్యం ద‌క్క‌డంతో మొత్తంగా 9 ప‌త‌కాల‌లో 3 స్వ‌ర్ణాలు, 3 ర‌జ‌తాలు, 3 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

మొద‌టి ప్ర‌య‌త్నంలో 90 కేజీలు ఎత్త‌డంలో అనుకోని రీతిలో హ‌ర్జీంద‌ర్ విఫ‌లం కావ‌డంతో ర‌జ‌తం కొద్ది ప్ర‌య‌త్నంలో ప‌త‌కం కోల్పోయింది హ‌ర్జీంద‌ర్ సింగ్ .

రెండో ప్ర‌య‌త్నంలో 90 కేజీలు ఎత్త‌గా మూడో సారి చేసిన ప్ర‌య‌త్నంలో 93 కేజీల బ‌రువును ఎత్తింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేట‌గిరీలో ఫ‌స్ట్ సారి 113 కేజీలు, రెండో ప్ర‌య‌త్నంలో 116 కేజీలు, మూడో ప్ర‌య‌త్నంలో 119 కేజీల బ‌రువును ఎత్తింది కౌర్.

ఇక మొత్తంగా చూస్తే 212 కేజీలు ఎత్తి కాంస్య ప‌త‌కాన్ని సాధించంది. బంగారు ప‌త‌కాల‌ను మీరా బాయి చాను, గెరిమె, అంచిత్ సాధించారు.

Also Read : మెకాయ్ దెబ్బ‌కు భార‌త్ విల విల

Leave A Reply

Your Email Id will not be published!