Al Quaeda : అల్ ఖైదా మోస్ట్ డేంజ‌ర‌స్ టెర్ర‌రిస్ట్ గ్రూప్

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్ర‌వాదానికి ఊతం

Al Quaeda : అమెరికా దెబ్బ‌కు మ‌రోసారి అల్ ఖైదా ఉగ్ర‌వాద సంస్థ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి క‌ర్త బిన్ లాడెన్ అయితే ఖ‌ర్మ అల్ జ‌వ‌హ‌రి. ఇద్ద‌రిని అమెరికా మ‌ట్టుబెట్టింది.

1988 నుంచి 2011 దాకా లాడెన్ చీఫ్ గా ఉన్నాడు. 2011 నుంచి 2022 దాకా అల్ జ‌వ‌హ‌రి బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఖైద‌త్ అల్ జిహాద్ అనేది స‌లాఫిస్ట్ జిహాదీల‌తో కూడిన బ‌హుళ‌జాతి తీవ్ర‌వాద సున్నీ ఇస్లామిక్ తీవ్ర‌వాద నెట్ వ‌ర్క్ సంస్థ‌.

దీనిని 1988 లో ఒసామా బిన్ లాడెన్ , అబ్దుల్లా అజ్జం తో పాటు సోవియ‌ట్ – ఆఫ్గ‌నిస్తాన్ యుద్దం స‌మ‌యంలో ఇత‌ర అర‌వ్ వాలంటీర్లు అల్ ఖైదాను స్థాపించారు.

అల్ ఖైదాను(Al Quaeda) ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి తీవ్ర‌వాద సంస్థ‌గా గుర్తించింది. అమెరికా రాయ‌బార కార్యాల‌యంపై బాంబు

దాడుల‌తో స‌హా వివిధ దేశాల‌లో సైనికేత‌ర‌, సైనిక స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగింది.

2001లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ప్ర‌పంచాన్ని విస్మయ ప‌రిచేలా చేసింది. అమెరికా ట‌వ‌ర్ల‌పై రాకెట్ ను ప్ర‌యోగించింది అల్ ఖైదా. ఇంట‌ర్నేష‌న‌ల్ గా విస్త‌రించేలా తీర్చిదిద్దారు బిన్ లాడెన్, అల్ జ‌వ‌హ‌రి. ప‌లు క‌మిటీలు కూడా ఏర్పాటు చేశారు.

చాలా ఇస్లామిక్ దేశాల‌లో ఆయా దేశాల‌కు అనుగుణంగా అల్ ఖైదా గ్రూపులుగా ఏర్పాట‌య్యాయి. వీటి లక్ష్యం ఒక్క‌టే యావ‌త్ ప్ర‌పంచాన్ని

ఇస్లామిక్ వ‌ర‌ల్డ్ గా మార్చ‌డం. జిహాదీల‌ను త‌యారు చేసింది.

అల్ ఖైదా త‌మ నాయ‌కుడు ఎవ‌రంటే ప్ర‌వ‌క్త ముహ‌మ్మ‌ద్ అని చెబుతుంది. సోవియ‌ట్ సామ్రాజ్యానికి వ్య‌తిరేకంగా పోరాడేందుకు యువ‌కుల‌కు

శిక్ష‌ణ ఇచ్చేందుకు అబూ ఉబైదా సైనిక స్థావ‌రాన్ని ఏర్పాటు చేశాడు.

దీనినే అల్ ఖైదా అని పిలుస్తారు. ఆనాటి నుంచి ఈ ఉగ్ర‌వాద సంస్థ అల్ ఖైదాగా మారింది. ఫిలిప్పీన్స్ , ఇండోనేషియా, మ‌లేషియా, ఇండియా,

పాకిస్తాన్ ఇలా ప్ర‌తి దేశంలో అల్ ఖైదా త‌న నెట్ వ‌ర్క్ ను విస్త‌రించింది.

ప్ర‌స్తుతం అమెరికా కొట్టిన దెబ్బ‌కు ఇద్ద‌రు చీఫ్ లు ఖ‌తం అయ్యారు. కానీ ఉగ్ర‌వాద‌మే ఊపిరిగా ఏర్పాటైన ఈ సంస్థ ఎంతో మందిని

ఉగ్ర‌వాదులుగా, జిహాదీలుగా త‌యారు చేసింది. ఆక్టోప‌స్ లా అల్లుకు పోయిన దీనిని నిర్మూలించాలంటే చాలా క‌ష్ట‌మైన ప‌ని.

Also Read : ఆ ఇద్ద‌రు అమెరికాను వ‌ణికించారు

Leave A Reply

Your Email Id will not be published!