UGC NET: యూజీసి ప్రశ్నపత్రం లీక్ చేసిన ఛానెళ్లపై టెలిగ్రాం నిషేదం !
యూజీసి ప్రశ్నపత్రం లీక్ చేసిన ఛానెళ్లపై టెలిగ్రాం నిషేదం !
UGC NET: నీట్ పేపర్ లీక్ వ్యవహారం, అదే సమయంలో యూజీసీ నెట్ పరీక్ష రద్దు కావడం వంటి పరిణామాలు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. యూజీసీ నెట్ పరీక్ష మంగళవారం జరగ్గా… దానికి రెండు రోజుల ముందే పరీక్షా పత్రం లీక్ అయిందని, ఆ వెంటనే ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రాం స్పందించింది. పేపర్ లీక్‌తో ప్రమేయం ఉన్న ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు ఓ జాతీయమీడియాకు వెల్లడించింది.
UGC NET….
పరీక్ష పత్రాలకు సంబంధించి అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు టెలిగ్రాం వెల్లడించింది. దేశ చట్టాలకు లోబడి, దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపింది. లీకేజీ వ్యవహారంలో ఈ సోషల్ మీడియా సంస్థపైనా విమర్శలు రావడంతో ఈ స్పందన వచ్చింది. దానిలో లీక్ అయిన పేపర్ అసలు పత్రంతో సరిపోలిందని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. యూజీసీ(UGC NET) నెట్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో నెట్ పరీక్ష కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. యూజీసీ నెట్ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి ప్రతీఏటా రెండు సార్లు ఈ పరీక్షను కేంద్రం నిర్వహిస్తోంది.
Also Read : Acharya Laxmikant Dixit: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత !