Priyanka Gandhi : ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పండి – ప్రియాంక
హిమచాల్ ప్రదేశ్ ర్యాలీలో కాంగ్రెస్ నేత
Priyanka Gandhi : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ పాలక ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిన మీరు ఈ ఐదేళ్ల కాలంలో ఏం చేశారో, ఎన్ని నిధులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు బీజేపీ డబుల్ ఇంజన్ లో ఆయిల్ అనేది ఉందా అని నిలదీశారు. దేని కోసం , ఎందు కోసం మిమ్మల్ని ఎన్నుకోవాలో చెప్పాలన్నారు. మతం, కులం, ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలకు తెర తీస్తూ ఓట్లు కొల్లగొడుతున్న పాలించే అర్హత లేదన్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పాలన అందించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని , తాము ఏం చెబుతామో దానిని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ. తమను ఆశీర్వదిస్తే లక్ష ఉద్యోగాలు, రద్దు చేసిన పెన్షన్ సౌకర్యాన్ని తిరిగి అమలు చేస్తామని అన్నారు.
తాము విడుదల చేసిన మేని ఫెస్టోను చూడాలన్నారు. గతంలో తాము చేసిన హామీలను ప్రస్తుత బీజేపీ కాపీ కొట్టిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. యువత ఇక నుంచి ఆందోళన చెందాల్సిన పని లేదని, వారందరికీ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇకనైనా ప్రజలు బాధ్యతతో తమ విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని కోరారు.
Also Read : మూన్ లైటింగ్ కు మేం ఓకే – గుర్మానీ