YS Sharmila : మోదీజీ కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడో చెప్పండి – షర్మిల
కేంద్రాన్ని నిలదీసిన వైఎస్సార్ టీపీ చీఫ్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరం సీఎం కేసీఆర్ కు ఏటీఎం లాగా మారిందని కేంద్ర మంత్రులు షెకావత్, నిర్మలా సీతారామన్ , స్టేట్ చీఫ్ బండి సంజయ్ పదే పదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు , ఏసీబీ , సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా ఎందుకుని కేసీఆర్ ను అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు.
శుక్రవారం రామగుండంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల(YS Sharmila) మాట్లాడారు. దోచు కోవడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి ఏమైనా రాసి ఇచ్చారా అని ప్రశ్నించారు.
సిగ్గు లజ్జా లేకుండా నిట్ట నిలువున్నా దోచుకుంటూ ప్రజలను ఆగం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీని ఇంకా ఎందుకు చర్యలు తీసుకోకుండా నాటకాలు ఆడుతున్నారంటూ నిప్పులు చెరిగారు.
కాలేశ్వరం అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసిన ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణాకు ఏమైనా లాభం చేకూరిందా అని నిలదీశారు. దీని వల్ల మెగా కృష్ణా రెడ్డి, సీఎం ఫ్యామిలీ తప్ప ప్రజలకు, రైతులకు ఒరిగింది ఏమీ లేదన్నారు వైఎస్ షర్మిల.
ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఏమైనా ముడుపులు ముడుతున్నాయా అని అన్నారు.
ఎందుకుని నోరు విప్పడం లేదన్నారు. ఏం సాధించారని ఈ భారత బందిపోట్ల సమితి పార్టీలో ఏకంగా 800 కోట్లకు పైగా డబ్బులు జమ అవుతాయని అన్నారు. ఎక్కడికి నుంచి ఈ డబ్బులు వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరంపై విచారణ జరిపించాలని కోరుతూ పీఎం మోదీకి వినతి పత్రం ఇస్తామని చెప్పారు వైఎస్ షర్మిల.
Also Read : తెలంగాణకు రానున్న పీఎం మోదీ