Telugu Software Engineer: అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి !

అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి !

Telugu Software Engineer: ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుచ్చిబాబు(40) అమెరికాలో మృతి చెందారు. ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్‌ కావడంతో శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లారు. ప్రమాదవశాత్తూ బీచ్‌లో నీటమునిగి మృతి చెందాడు. కుమారుడు చనిపోయిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Telugu Software Engineer…

బుచ్చిబాబు మృతితో ముండమూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉన్నత ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళి… అక్కడ మృత్యువాత పడటం పట్ల బుచ్చిబాబు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం చొరవ తీసుకుని బుచ్చిబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

Also Read : Vangalapudi Anitha: సింహాచలం అప్పన్నను కుటుంబస సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి అనిత !

Leave A Reply

Your Email Id will not be published!