Kiren Rijiju : న్యాయమూర్తులను నియమించే పవర్స్ లేవు
మరోసారి సీరియస్ కామెంట్స్ చేసిన మంత్రి
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా పదే పదే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం వ్యవస్థ ఏర్పాటుపై ప్రస్తావిస్తున్నారు. దానిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అంతే కాదు న్యాయ వ్యవస్థ పరిధి దాటి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదన్నారు. కేవలం ప్రభుత్వ నిర్ణయాధికారం లేకుండా కేవలం న్యాయమూర్తులను న్యాయమూర్తులే డిసైడ్ చేయడం ఒక్క భారత దేశంలో మాత్రమే ఉందన్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం వ్యవస్థపై తన విమర్శలను రెట్టింపు చేశారు.
జడ్జీల నియామకంలో ప్రభుత్వానికి చాలా పరిమిత పాత్ర మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరోసారి కొలీజియం వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఎత్తి చూపారు. దేశ వ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఇది తనను ఎక్కువగా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
దీనికి ప్రధాన కారణం న్యాయమూర్తల నియామకమేనని ఆరోపించారు కిరెన్ రిజిజు. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వానికి చాలా పరిమితమైన పాత్ర ఉందన్నారు. కొలీజియం పేర్లను ఎంచుకుంటుంది, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ చట్టం చేసినా నియమించే అధికారం ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి(Kiren Rijiju). దీనిపై పెద్ద రాద్దాంతం జరుగుతోంది.
నాణ్యత, భారత దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే , మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించే పేర్లను పంపాలని ప్రభుత్వం తరచుగా భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తెలియ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
Also Read : బెయిల్ పిటిషన్లను విచారించ వద్దు – రిజిజు