Temjen Imna : కమల వికాసం ‘ఇమ్నా’ ప్రత్యేకం
టెమ్ జెన్ ఇమ్నా వెరీ వెరీ స్పెషల్
Temjen Imna : ఈ దేశంలో మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్లలో టాప్ లో ఉన్న నాయకులలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో నాగాలాండ్ కు చెందిన రాష్ట్ర మంత్రి టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna). సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ పర్సన్ గా పేరొందారు. ప్రజలతో మమేకం కావడంలో ఆయనకు ఆయనే సాటి.
ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తర్వాత అంతటి జనాదరణ కలిగిన నాయకుల్లో టెమ్ జెన్ ఇమ్నా ఒకరు. ఎక్కడా విమర్శలు ఉండవు. ఆరోపణలు చేయరు. నాగాలాండ్ వాసులతో కలిసి పోతారు. ఆధ్యాత్మికమైనా లేదా వ్యక్తిత్వ వికాసమైనా ఏదైనా ఏ రంగమైనా సరే వెంటనే స్పందిస్తారు టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna).
ఆయన పూర్తి పూర్తి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. నాగాలాండ్ లో చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఇమ్నాను ప్రేమిస్తారు. ఆదరిస్తారు. కోరకుంటారు అతడి సాహచర్యాన్ని. టెమ్ జెన్ ఇమ్నా పూర్తిగా సానుకూల దృక్ఫథాన్ని కలిగి ఉంటారు. ప్రతి రోజూ మోటివేషన్ తో కూడిన కామెంట్స్ , పోయెంట్స్ , కథలు, తనకు నచ్చిన ప్రజలు సాధించిన వియాలను పోస్ట్ చేస్తూ, షేర్ చేస్తూ వస్తారు
టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. 2020 జనవరిలో మొదటిసారిగా నాగాలాండ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఎన్నికయ్యారు. ఈశాన్య ప్రాంతంలోని నాగాలాండ్ లోని మోకోక్ చుంగ్ లోని అలోంగ్టాకిలో నవంబర్ 25, 1980లో పుట్టాడు ఇమ్నా. నాగా లాండ్ లోని అవో తెగకు చెందిన వాడు. ఉన్నత విద్యను దిమాపూర్ లోని సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ చదివాడు.
కెరీర్ తొలినాళ్లలో నాగాలాండ్ లో టీచర్ గా పని చేశాడు. సొంతంగా వ్యాపారం చేశాడు. 2018లో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అలోంగ్టాకీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. హాస్యం, ఆనందం అన్నది లేక పోతే జీవితానికి అర్థం ఏముంటుందని ప్రశ్నిస్తాడు టెమ్ జెన్ ఇమ్నా.
చూసేందుకు అతడి కళ్లు చిన్నవిగా ఉంటాయి. ఈ సందర్భంగా తన మీద తానే జోక్ వేస్తూ ..మా కళ్లు చిన్నవిగా ఉన్నా మేం ప్రపంచాన్ని స్పష్టంగా చూస్తామన్నాడు. 2019లో నాగాలాండ్ కు ఉన్నత, సాంకేతిక విద్య, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా కొలువు తీరారు. ఏది ఏమైనా టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ కుమార్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
Also Read : మీసాలు తిప్పిన రాహుల్..బాక్సర్