Texas Mall Shooting : అమెరికాలో కాల్పుల మోత
8 మంది మృతి 7 గురికి గాయాలు
Texas Mall Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. యుఎస్ మాల్ లో ఓ దుండగుడు రెచ్చి పోయాడు. కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులు జరిపిన ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 7 గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యుఎస్ లోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. సామూహిక కాల్పుల ఘటనను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తీరని విషాదంగా అభివర్ణించారు.
టెక్సాస్ లోని ఓ ఔట్ లెట్ మాల్(Texas Mall Shooting) లో శనివారం విధ్వంస జరిగే కంటే ముందు దుండగుడు తను చని పోయే ముందు ఎనిమిది మందిని కాల్చి చంపాడు. ఈ విషయాన్ని టెక్సాస్ పోలీసులు ధ్రువీకరించారు. వారంతాపు దుకాణాదారులతో నిండిన డల్లాస్ కు ఉత్తరాన 25 మైళ్ల దూరంలో ఉన్న అలెన్ లోని విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్ అలెన్ ప్రీమియమ్ అవుట్ లెట్స్ లో కాల్పులు భయాందోళనలకు దారి తీశాయి.
ఈ ఘటన మధ్యాహ్నం 3.30 గంటలకు కాల్పులు జరిగిన సమయంలో ఓ పోలీస్ అధికారి సంబంధం లేని కాల్ లో మాల్ లో ఉన్నారు. అలెన్ పోలీస్ విభాగానికి చెందిన చీఫ్ బ్రియాన్ హార్వే తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడించ లేదు. ఇక కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో కొందరు ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారు.
Also Read : ఉగ్రవాదం గురించి మోదీకి ఏం తెలుసు