TG Ministers : సియోల్ లో తెలంగాణ మంత్రుల 2వ రోజు బిజీ బిజీ పర్యటన
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ....
TG Ministers : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రెండో రోజు తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా హాన్ రివర్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), పొన్నం ప్రభాకర్, మున్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సందర్శించారు. సియోల్ మెట్రో పరిధిలో 70 కిలో మీటర్ల మేర హాన్ రివర్ ప్రవహిస్తోంది. దక్షిణ కొరియాలో రెండో అతి పొడవైన రివర్ హాన్ అని చెప్పుకొవచ్చు. రివర్ పొడవు 512కిలో మీటర్లు కాగా.. వెడల్పు 1.2 కిలో మీటర్లు ఉంది. ఈ సందర్భంగా హాన్ రివర్‌ను సందర్శించిన టీ.మంత్రులు, అధికారుల బృందం.. హాన్ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, నిర్వాసితులకు పరిహారం వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
TG Ministers Visit..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ.. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. బీఆర్ఎస్ వాళ్ల పరిస్థితి అలానే ఉందంటూ విమర్శలు గుప్పించారు. చిన్న కాలువలు కలిస్తేనే పెద్ద కాలువ అవుతుందన్నారు. సియోల్ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నిన్న చిన్న నది చూశామని.. ఈరోజు పెద్ద నది చూశామని తెలిపారు. నది చిన్నదా పెద్దదా అని కాదని… రెండింటిని ఎలా అభివృద్ది చేశారు అనేది చూడాలని తెలిపారు. మూసీని కూడా అలా పునరుజ్జీవం చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఎవరికి అన్యాయం జరగకుండా మూసీనీ అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. నిన్న(సోమవారం) సియోల్‌లో పర్యటించిన తెలంగాణ మంత్రులు, అధికారులు చియంగ్ చు నదిని సందర్శించారు. ముందుగా సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చీయంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ , మూసీ రివర్ ప్రంట్ అధికారులు ఉన్నారు.
Also Read : AP Deputy CM : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిట్ కోర్టు నుంచి నోటీసులు