CJI DY Chandrachud : రాజ్యాంగం ఆత్మ‌ను అర్థం చేసుకోవాలి

స్ప‌ష్టం చేసిన సీజేఐ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్

CJI DY Chandrachud : భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజయ వై చంద్ర‌చూడ్(CJI DY Chandrachud)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో న్యాయ‌మూర్తుల పాత్ర ఎంత ముఖ్య‌మైన‌ద‌నో స్ప‌ష్టం చేశారు. న్యాయ‌మూర్తి నైపుణ్యం అనేది తీర్పులు ఇవ్వడంలో ప్ర‌తిఫ‌లిస్తుంద‌న్నారు. భార‌త రాజ్యాంగం ప్రాథ‌మిక నిర్మాణం మార్గ నిర్దేశం చేస్తుంద‌న్నారు.

ముందుకు సాగే మార్గం మెలికలు తిరిగిన‌ప్పుడు దాని వ్యాఖ్య‌త‌లు , అమ‌లు చేసే వారికి నిర్దిష్ట దిశ‌ను అందిస్తుందని పేర్కొన్నారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ . ప్ర‌ధానంగా మ‌న రాజ్యాంగం ప్రాథ‌మిక నిర్మాణం ఉత్త‌ర న‌క్ష‌త్రం లాంటిద‌ని భారత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగం ల‌ని పాఠ్యాంశాల‌ను ద‌దాని ఆత్మ చెక్కు చెద‌ర‌కుండా అర్థం చేసుకోవడంలో న్యాయ‌మూర్తి నైపుణ్యం ఉంటుంద‌న్నారు డీవై చంద్ర‌చూడ్(CJI DY Chandrachud) . కొత్త‌గా చోటు చేసుకున్న సాంకేతిక‌త ప్ర‌స్తుతం ఎన్నో మార్పుల‌కు లోన‌వుతోంద‌న్నారు సీజేఐ. శ‌నివారం ముంబైలో జ‌రిగిన నాని ఎ పాల్కివాలా మెమోరియ‌ల్ లెక్చ‌ర్ లో డీవై చంద్ర‌చూడ్ పాల్గొని ప్ర‌సంగించారు.

భార‌త రాజ్యాంగం గుర్తింపు రాజ్యాంగంతో భార‌తీయ పౌరుల ప‌ర‌స్ప‌ర చ‌ర్య ద్వారా ఉద్భ‌వించిందని తెలిపారు. న్యాయ‌మూర్తి నైపుణ్యం దాని ఆత్మ‌ను చెక్కు చెద‌ర‌కుండా ఉంచుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగం పాఠాన్ని అర్థం చేసుకోవడంలో ఉంద‌న్నారు.

చ‌ట్టం పాల‌న , అధికారాల విభ‌జ‌న‌, న్యాయ స‌మీక్ష‌, లౌకిక వాదం, స‌మాఖ్య వాదం, స్వేచ్ఛ‌, వ్య‌క్తి గౌర‌వం, దేశం ఐక్యత‌, స‌మ‌గ్ర‌త అన్న‌ది అత్యంత ముఖ్య‌మైన‌వ‌ని పేర్కొన్నారు సీజేఐ డీవై చంద్ర‌చూడ్. అభివృద్ది చెందుతున్న ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ జాతీయ స‌రిహ‌ద్దుల‌ను తుడిచి పెట్టింద‌ని అన్నారు.

Also Read : 25న నోరా ఫ‌తేహీ దావా విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!